ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద‍్యోగాలు, లక్షల్లో వేతనాలు

Indian It Services Hiring 70,000 People Across Just Six Roles Offering Salary Hike Of 50-60 Percent - Sakshi

కరోనా కారణంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఊపందుకుంది. ఐటీ రంగానికి చెందిన ఆరు విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉందని సిబ్బంది సేవ‌ల సంస్థ ఎక్స్‌ఫెనో తెలిపింది. ఎక్స్‌ఫెనో తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ సెక్టార్‌లో ప్రాడక్ట్‌, సర్వీస్‌ విభాగాల్లో వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 

ఇండియన్‌ ఐటీ సర్వీసులు, స్టార్ట్‌ అప్‌లతో పాటు ఇతర ప్రాడక్ట్‌ బేస్డ్‌ కంపెనీలు ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున‍్నట్లు తెలిపింది. ఆరు విభాగాల్లో ముఖ్యంగా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌, డేటా ఇంజనీర్లు, రియాక్ట్‌ నెగిటీవ్‌ డెవలపర్స్‌, డెవలపర్స్‌, బ్యాకెండ్‌ ఇంజినీర్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయని చెప్పింది. ఈ ఆరు విభాగాల్లో మొత్తం 70 వేలు, అంతేకంటే ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉందన్న ఎక్స్‌ఫెనో.. ఎవరైతో ఈ ఉద్యోగాల్లో రాణిస్తారో వారికి అనుభవాన్ని బట్ట 50నుంచి 60శాతం హైక్‌ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాది ఇదే విభానికి చెందిన 3నుంచి 8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న ఉద్యోగులకు 20-25 శాతం శాలరీల్ని హైక్‌ ఇచ్చాయి. 

కరోనా కారణంగా ప్రాడక్ట్‌, సర్వీస్‌ బేస్డ్‌ రంగాల్లో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల, శాలరీల విషయంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదని ఎక్స్‌ఫెనోమ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు గతేడాది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌  3వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి ఉద్యోగుల అవసరం పెరిగి 18వేల నుంచి 32వేల మంది ఉద్యోగుల ఎంపిక చేసినట్లు యాక్సెంచర్‌ సీఈఓ జూలీస్వీట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు ఈ ఆరురంగాల్లో నిష్ణాతులై ఉండాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top