India industrial production index: తగ్గిన పారిశ్రామిక వృద్ధి స్పీడ్‌

India industrial production index 2023: Factory output growth slows to 4. 3percent in December - Sakshi

2022 డిసెంబర్‌లో ఐఐపీ పెరుగుదల 4.3 శాతం

నవంబర్‌లో పురోగతి 7.3 శాతం

తయారీ పేలవ పనితీరు

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2022 డిసెంబర్‌లో మందగించింది. సమీక్షా నెల్లో ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు 7.3 శాతం. మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల పేలవ పనితీరు డిసెంబర్‌ గణాంకాలపై పడినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెలువరించిన లెక్కలు పేర్కొంటున్నాయి.

ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల రంగం ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం కూడా వృద్ధి (5.1 శాతం) నుంచి క్షీణతకు (–10.4 శాతం) మారింది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగంలో వృద్ధి రేటు తగ్గింది.  వార్షికంగా పరిశీలిస్తే మాత్రం 2021 డిసెంబర్‌కన్నా 2022 డిసెంబర్‌లో పనితీరు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తున్న అంశం. అప్పట్లో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే.

9 నెలల్లో ఇలా...
మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్‌– డిసెంబర్‌) ఐఐపీ 5.4 శాతం పురోగమించగా, 2021 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 15.3 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ నాటికి ఈ వృద్ధి రేటు 5.5 శాతం  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top