దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ వృద్ధికి బడా టెక్ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్‌లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్ స్వరూపం’ పేరుతో ది డైలాగ్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్‌లు, బిజినెస్ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.
ముఖ్యాంశాలివీ...
నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ భూమిక అగర్వాల్ పేర్కొన్నారు.
ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.
భారత్‌లోని ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు ఓపెన్ సోర్స్ మోడళ్లు, టూల్స్‌పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్‌లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!


