హెలికాఫ్టర్‌కు పూజలు నిర్వహించిన తెలంగాణ వ్యాపారవేత్త | Hyderabad Businessman Do Vahan Puja To His New Helicopter At Yadadri | Sakshi
Sakshi News home page

హెలికాఫ్టర్‌కు పూజలు నిర్వహించిన తెలంగాణ వ్యాపారవేత్త

Published Fri, Dec 16 2022 12:36 PM | Last Updated on Fri, Dec 16 2022 1:49 PM

Hyderabad Businessman Do Vahan Puja To His New Helicopter At Yadadri - Sakshi

భారతదేశంలో కొత్త వాహనాలను వినియోగించే ముందు వాటికి పూజలు చేయడం ఆచారం. అందుకే ప్రజలు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు జరిపిస్తుంటారు. అయితే తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు మాత్రం ఈ సంప్రదాయాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను పూజలు జరిపించారు. 

తెలంగాణకు చెందిన ప్రతిమ గ్రూప్‌కు యాజమాని బోయినపల్లి శ్రీనివాసరావు ఇటీవల ఎయిర్‌బస్ ACH-135హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. కొత్త వాహనం కావడంతో హెలికాఫ్టర్‌కు వాహన పూజ జరిపేందుకు హైదరాబాద్‌కు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న యాదాద్రి గుట్టపైకి వెళ్లారు. ముగ్గురు పూజారుల నేతృత్వంలో హెలికాఫ్టర్‌కు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మరో వైపు హెలికాప్టర్‌కు పూజలు చేస్తుంటే చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఈ హెలికాప్టర్‌ "వాహన్ పూజ" వీడియో సోషల్ మీడియాలో వైరల్ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 


చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement