స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.
ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.
బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్‌బాల్ క్రీడాకారుడు.. బేస్‌బాల్‌లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్‌ను కొనాల్సిన అవసరం లేదు.
Warren Buffett’s greatest lesson: NEVER CHASE.
In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.
Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily.
If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026
బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.
ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు.


