మీ 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్‌డేట్‌ చేసుకోండిలా!

How To Add or Update Mobile Number in Aadhar Telugu - Sakshi

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) తన పోర్టల్ లో అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యూజర్ల కోసం తీసుకొస్తుంది. యుఐడీఏఐ తీసుకొచ్చిన అలాంటి ఒక సౌకర్యం వల్ల మీ పాత ఆధార్ మొబైల్ నెంబర్ స్థానంలో సులభంగా కొత్త నెంబర్ జత చేసుకునే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డుకు మరో కొత్త మొబైల్ నెంబరు జత చేయాలని అనుకుంటే ముందుగా మీరు ఈ దశలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

'ఆధార్' మొబైల్ నెంబర్ అప్‌డేట్‌ విధానం

  • మీ మొబైల్ నెంబరు అప్‌డేట్‌ చేయడం కొరకు యుఐడీఏఐ వెబ్ పోర్టల్(ask.uidai.gov.in)ను సందర్శించండి.
  • ఆ తర్వాత, మీరు అప్‌డేట్‌ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబరు, క్యాప్చాను సంబంధిత బాక్సుల్లో టైప్ చేయండి.
  • 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి 'సబ్మిట్ ఓటీపీ & ప్రొసీడ్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • అనంతరం ఓపెన్‌ అయిన డ్రాప్‌డౌన్‌ బాక్స్‌లో ‘అప్‌డేట్‌ ఆధార్‌’పై క్లిక్ చేసి ముందుకెళ్లండి. 
  • ఆపై ఆధార్‌ నంబర్‌, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్‌డేట్‌ చేయాలనుకుంటున్న ‘మొబైల్‌ నంబర్‌’ కింద ఎంచుకొని ప్రోసిడ్‌ అవ్వండి.
  • మొబైల్ నెంబరు సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్‌ నంబర్‌, క్యాప్‌చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్‌ క్లిక్ చేయండి.

దీని తర్వాత, రూ.25 ఫీజు చెల్లించడానికి అవసరమైన అదనపు సమాచారాన్ని నమోదు చేసి మీ దగ్గరల్లో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లడానికి మీరు ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top