డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్‌.. హాట్‌హాట్‌

Hotstar growing rapidly in Disney plus subscriber base - Sakshi

సభ్యుల సంఖ్యలో 30 శాతం వాటా

26 మిలియన్లమంది సబ్‌స్క్రైబర్లు

వేగంగా పెరుగుతున్న యూజర్లు

ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌ మద్దతు

భారత్‌ నుంచి అత్యధిక వినియోగదారులు

ముంబై, సాక్షి: ప్రపంచవ్యాప్తంగా డిస్నీప్లస్‌కున్న 8.68 కోట్ల సబ్‌స్క్రైబర్లలో హాట్‌స్టార్‌ యూజర్ల సంఖ్య 30 శాతానికి చేరింది. ఈ నెల 2కల్లా హాట్‌స్టార్‌ యూజర్లు 2.6 కోట్లకు చేరినట్లు డిస్నీస్‌ ప్రపంచ కార్యకలాపాలు, డైరెక్ట్‌ టు కన్జూమర్‌ విభాగం చైర్మన్‌ రెబెక్కా క్యాంప్‌బెల్‌ వెల్లడించారు. గత రెండు నెలల్లోనే 75 లక్షల మంది కొత్తగా జత కలసినట్లు ఇన్వెస్టర్ల డే సందర్శంగా తెలియజేశారు. సెప్టెంబర్ చివరికల్లా హాట్‌స్టార్‌ యూజర్ల సంఖ్య 1.85 కోట్లుగా నమోదు కాగా.. హాట్‌స్టార్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో భారత్‌కు మెజారిటీ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్లో ఇండొనేసియా, సింగపూర్‌లో గత నెలలో సర్వీసులను ప్రారంభించింది. కాగా. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్ట్రీమింగ్‌ సర్వీసులకు ప్రస్తుతం 13.7 కోట్లమంది పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లున్నట్లు డిస్నీ సీఎఫ్‌వో క్రిస్టీన్‌ మెకార్థీ  తెలియజేశారు. 2024కల్లా ఈ సంఖ్య 30-35 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. (ఫేస్‌బుక్‌ నుంచి విడిగా వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌?)

ఐపీఎల్‌ ఎఫెక్ట్‌
గత నెలలో ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 13వ ఎడిషన్‌ కారణంగా హాట్‌స్టార్‌ యూజర్ల సంఖ్యలో వృద్ధి నమోదైనట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీంతో దేశీయంగా ఈ సర్వీసులపై సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడిపై సగటున 2.19 డాలర్ల ఆదాయం నమోదైంది. భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల కారణంగా డిస్నీప్లస్‌కు ప్రధాన మార్కెట్‌గా మారినట్లు క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా స్టార్‌ టీవీ, హాట్‌స్టార్‌ కారణమవుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఏడు ప్రాంతీయ భాషలలో సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఏటా 17,000 గంటల స్థానిక ఒరిజినల్‌ కార్యక్రమాలను జత చేస్తున్నట్లు వివరించారు. కాగా.. దేశీయంగా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్..‌ ఇతర గ్లోబల్‌ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జీ5 (ఎస్సెల్‌ గ్రూప్‌), సోనీ లైవ్‌ తదితరాలతో పోటీని ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. (టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top