
గురుగ్రాం: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోలో సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్ ఎస్పీ పేర్లతో రెండు మోటార్స్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ.8,59,500లు, రూ.12,35,900గా ఉన్నాయి. ఈ రెండు మోడళ్లకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
హోండా సీబీ750 హార్నెట్755సీసీ, సీబీ1000 హార్నెట్ ఎస్పీ 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు కలిగి ఉన్నాయి. ఈ బైకుల్లో 6–స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంది. అయిదు అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ –బై –టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ (హోండా రోడ్‌సింక్), యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

రెండు బైకుల్లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, యూజర్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 3 స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సీబీ750 హార్నెట్ బిగ్‌వింగ్ టాప్‌లైన్, బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉంచగా, సీబీ 1000 హార్నెట్ ఎస్‌పీ మాత్రం ప్రత్యేకంగా బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్íÙప్‌ల ద్వారా మాత్రమే విక్రయిస్తుంది.
