‘ఎలివేట్‌’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా | Sakshi
Sakshi News home page

‘ఎలివేట్‌’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా

Published Wed, May 3 2023 7:01 PM

Honda Elevate Suv Will Be Formally Introduced In India Next Month - Sakshi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా భారత్‌లో ఎస్‌యూవీ మార్కెట్‌ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిడ్‌ రేంజ్‌ ఎస్‌యూవీ వాహనాలైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్‌ విటార’ తరహాలో మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ కార్‌ను మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల జూన్‌ 6న  ‘ఎలివేట్‌’ పేరుతో ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు హోండా అధికారికంగా ప్రకటించింది. 

హోండా ఎలివేట్‌ ఇంజన్‌ ఉందంటే
ఎలివేట్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌లో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో పాటు మ్యాన్యువల్‌ ఆప్షన్‌ కూడా ఉంది. సీవీటీ గేర్‌ బాక్స్‌లు ఉన్నాయి. కార్‌ సౌకర్యంగా ఉండేలా అప్‌రైట్‌ స్టాన్స్‌, డ్రైవింగ్‌ సమయంలో కాంతివంతంగా ఉండేలా స్లీక్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాహనంలోని ప్రయాణికుల్ని సంరక్షించేలా  మెటల్‌ బార్స్‌ గ్రిల్స్‌తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

దేశీయ కంపెనీలతో పోటీపడలేక
భారత్‌లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీల వాటా 47 శాతం. కానీ 2020లో ఎస్‌యూవీ మార్కెట్‌ వ్యాల్యూ 28 శాతంగా ఉంది. కోవిడ్‌-19తో ఆటోమొబైల్‌ రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. హ్యుందయ్‌, దేశీయ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్‌, మారుతి సుజికిల నుంచి గట్టి పోటీ ఎదురైంది.  ఈ వరుస విపత్కర పరిణామాలతో హోండా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ నోయిడాలో తయారీ ప్లాంటును రాజస్థాన్‌కు తరలించింది. దీంతో పాటు సివిక్‌ సెడాన్‌, సీఆర్‌- వీ ఎస్‌యూవీ తయారీని నిలిపింది. 

3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత
ఆ మరుసటి ఏడాది అంటే 2021లో భారత్‌లో కొత్త ఎస్‌యూవీ కారును విడుదల చేయాలని హోండా గట్టి ప్రయత్నాలే చేసింది. 7 సీట్ల ఎస్‌యూవీ కోసం ‘ఎలివేట్‌’ పేరుతో ట్రేడ్‌ మార్క్‌ను రిజిస్టర్‌ చేసింది. కానీ ఆ కార్‌ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై స్పష్టం చేయలేదు. తిరిగి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎలివేట్‌ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది .కాగా, హోండా కార్స్‌ ఇండియా ప్రస్తుతం భారత్‌లో సిటీ , అమేజ్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది.

చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో!

Advertisement
 
Advertisement
 
Advertisement