Honda CB300F Bike Gets Rs 50,000 Price Cut, Cheaper Than Duke 125 - Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: భారీ డిస్కౌంట్‌, ఈ బైక్‌పై రూ.50వేలు తగ్గింపు!

Dec 19 2022 12:49 PM | Updated on Dec 19 2022 3:04 PM

Honda CB300F Bike Gets Rs 50,000 Price Cut, Cheaper Than Duke 125 - Sakshi

హోండా మోటార్ సైకిల్ & స్కూటర్  ఇండియా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది.  బైక్‌ లవర్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాలు పెంచుకునేందుకు తాజాగా లాంచ్ చేసిన కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌పై భారీగా డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఈ ఏడాది ఆగస్ట్‌లో సరికొత్తగా హోండా CB300F బైక్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు, ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ ధరను రూ.50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ పరిమితి కాలానికే వర్తించనుందని తెలిపింది.

భారీ తగ్గింపు!
కొత్త హోండా CB300F స్ట్రీట్‌ఫైటర్‌ బైక్ రెండు వేరియంట్‌లలో లభిస్తోంది. అది డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో.  వాటి ప్రారంభ ధర రూ.2.26 లక్షలు, రూ.2.29 లక్షలు ఉండగా తాజాగా కంపెనీ వాటిపై రూ. 50,000 తగ్గించింది. దీంతో  డీలక్స్ ధర రూ. 1.76 లక్షలుకాగా, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలుగా ఉంది. కొత్త ధర ప్రకారం KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే హోండా సీబీ300F తక్కువ ధరకే లభిస్తుంది.

125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు ఉండగా, హోండా బైక్‌ ధర రూ. 1.76 లక్షలు ఉంది. హోండా CB300F పవర్‌లో 293.52cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తోంది. ఈ మోటార్ 7,500 RPM వద్ద 24.1 bhp మరియు 5,500 RPM వద్ద 25.6 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement