రూ.1.12 లక్షల కొత్త హార్నెట్ బైక్ | Honda CB125 Hornet Launched at Rs 112 Lakh in India | Sakshi
Sakshi News home page

రూ.1.12 లక్షల కొత్త హార్నెట్ బైక్

Aug 10 2025 9:23 PM | Updated on Aug 10 2025 9:26 PM

Honda CB125 Hornet Launched at Rs 112 Lakh in India

హోండా మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో 'సీబీ 125' హార్నెట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్ షోరూం).

అప్డేటెడ్ డిజైన్ కలిగిన హోండా సీబీ 125 హార్నెట్ బైక్.. 123.94 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 10.99 bhp పవర్మ, 11.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ కొత్త స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మితమై ఉంది.

ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్

ట్యూబ్‌లెస్ టైర్లను కలిగిన సీబీ 125 హార్నెట్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్, వెనుక భాగంలో 130 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అదనపు భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించే 4.2 ఇంచెస్ TFT డిస్ప్లే ఈ బైకులో చూడవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ కూడా లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement