బాప్‌రే! ఇది నోకియా ‘బాహుబలి’ | HMD Global Launched Nokia XR 20 Rugged Smart Phone | Sakshi
Sakshi News home page

Nokia XR20: నీళ్లలో తడిచినా.. ఎత్తు నుంచి కింద పడినా..

Jul 27 2021 4:52 PM | Updated on Jul 27 2021 5:48 PM

HMD Global Launched Nokia XR 20 Rugged Smart Phone  - Sakshi

ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్‌ని మార్కెట్‌లోకి తేనుంది.

పూర్వ వైభవం కోసం
ఒకప్పుడు ఇండియా మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్‌ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్‌ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్‌ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్‌లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్‌ని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. 

రఫ్‌ అండ్‌ టఫ్‌
రఫ్‌ అండ్‌ టఫ్‌ ఫీచర్లతో ఎస్‌ఆర్‌ 20 మొబైల్‌ని నోకియా మార్కెట్‌లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్‌ చేసింది. ఈ మొబైల్‌కి ఐపీ 68 సర్టిఫికేట్‌ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్‌ ఫ్రూఫ్‌, వాటర్‌ ప్రూఫ్‌గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్‌ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్‌ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్‌ 480
ఇంటర్నల్‌ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్‌ అయ్యింది. స్నాప్‌డ్రాగన్‌ 480 చిప్‌సెట్‌ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజీ,  6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్‌, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్‌ఈడీ  ఫ్లాష్‌లను ఇచ్చింది. ఫ్రంట్‌ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్‌. ప్రస్తుతం మార్కెట్‌లో 4కే డిస్‌ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్‌’ పని చేసేలా డిజైన్‌ చేసింది. 

వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌
ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్‌పై ఈ మొబైల్‌ ఫోన్‌ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్‌గా ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా  18 వాట్స్‌ వైర్‌డ్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ని ఫోన్‌ డిస్‌పై వైపు కాకుండా పవర్‌ బటన్‌ ఉండే వైపున ఏర్పాటు చేసింది.

ఆగస్టు 24న
నోకియా ఎక్స్‌ఆర్‌ 20 మోడల్‌ని ఆగస్టు 24 మార్కెట్‌లో అమ్మకానికి రానుంది,. మొబైల్‌ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని నోకియా తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement