హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భేష్‌

HDFC Bank Q2 net up 18 percent to Rs 8,834 crores - Sakshi

క్యూ2లో లాభం 18 శాతం అప్‌

20 శాతానికి కనీస మూలధన నిష్పత్తి

అనుబంధ సంస్థల ఫలితాలు అదుర్స్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్‌)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్‌లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది.  

కేటాయింపులు ఇలా
క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్‌ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్‌–3 ప్రమాణ అదనపు టైర్‌–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్‌ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.  

టర్న్‌అరౌండ్‌..
డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్‌బీఎఫ్‌సీ.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ లిమిటెడ్‌ క్యూ2లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్‌ అనుబంధ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెపె్టంబర్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top