కరోనా టెర్రర్‌: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం | HDFC Bank Deploys Mobile ATMs In 19 Cities | Sakshi
Sakshi News home page

కరోనా టెర్రర్‌: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం

Apr 26 2021 12:31 AM | Updated on Apr 26 2021 8:41 AM

HDFC Bank Deploys Mobile ATMs In 19 Cities - Sakshi

ముంబై: కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల సౌకర్యార్థం ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొబైల్‌ ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్స్‌ను (ఏటీఎం) రంగంలోకి దింపింది. హైదరాబాద్‌సహా 19 నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో మొబైల్‌ ఏటీఎం ప్రతిరోజు మూడు నాలుగు ప్రాంతాలను కవర్‌ చేస్తుంది. వీటి ద్వారా 15 రకాల లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

వినియోగదార్లు నగదు స్వీకరణకు తమ ప్రాంతం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం కల్పించినట్టు బ్యాంకు తెలిపింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం సామాజిక దూరం, శానిటైజేషన్‌ ఏర్పాట్లు ఉన్నాయని వివ రించింది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో 50 నగరాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన మొబైల్‌ ఏటీఎంలను లక్షలాది మంది వినియోగించుకున్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement