రీసేల్‌ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!

Guide For Buying Resale Property In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రీసేల్‌ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది.

గోడల ధృడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్‌ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది.

వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top