జీఎస్‌టీ శుభారంభం 

GST Revenues Surge To All Time High Of Rs 1. 68 Lakh Crore In April - Sakshi

ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి

రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు   

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఏప్రిల్‌లో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి నెలతో పోల్చితే ఈ మొత్తం 25 శాతం అధికం. వ్యాపార క్రియాశీలత మెరుగుదలను గణాంకాలు సూచిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం... 

►ఏప్రిల్‌లో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లు.  
►వాటిలో సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.33,159 కోట్లు. 
►స్టేట్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.41,793 కోట్లు. 
►ఇంటిగ్రేటెడ్‌ వసూళ్లు రూ.81,939 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.36,705 కోట్లుసహా). 
►సెస్‌ రూ.10,649 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.857 కోట్లు సహా). 
►ఇప్పటి వరకూ గత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిలో రూ.1.42 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మరుసటి నెల్లోనే ఆ పరిమాణాన్ని తాజా గణాంకాలు అధిగమించడం గమనార్హం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top