India: రూ. 10 కాయిన్‌ చెల్లుతుందా..చెల్లదా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

Govt Responds On Rs 10 Coins Are Legal Tenders - Sakshi

మనం దగ్గరలోని మార్కెట్‌కి వెళ్లినప్పుడు సదరు షాప్ యజమానికి రూ.10 నాణెం ఇస్తే...ఇది చెల్లదు అంటూ..వేరే రూ. 10 నోట్‌ ఇస్తూ ఉంటాం. అంత ఎందుకు మనలో కొంతమంది రూ. 10 కాయిన్‌ను తీసుకోవాలంటే వెనకముందు అవుతుంటాం. రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పటికీ సామాన్యుల్లో ఉన్నాయి. రూ.10 కాయిన్ చెల్లుతుందని కొందరు, చెల్లదని ఇంకొందరు... ఈ వాదనలు చాలాకాలంగా ఉన్నవే. ఇక రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా రూ. 10 నాణేంపై కేంద్రం స్పందించింది. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇదే..!
ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక వ్రాతపూర్వక సమాధానంలో రూ. 10 నాణెంపై స్పందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించబడిన, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపిణీ చేయబడిన వివిధ రకాల రూ. 10 నాణేలు చట్టబద్ధమైనవని తెలిపారు.  అన్ని లావాదేవీలలో చట్టపరమైన టెండర్‌గా ఉపయోగించవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రూ. 10 నాణేలను నకిలీవిగా భావించి అంగీకరించడం లేదని రాజ్యసభలో ఎంపీ ఎ. విజయకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.

రూ. 10 నాణెం అంగీకరించకపోవడంపై కొన్ని ఫిర్యాదులు ఎప్పటికప్పుడు సాధారణ ప్రజల నుంచి స్వీకరించామని తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి, అపోహలను తొలగించడానికి ఆర్బీఐ కాలానుగుణంగా పత్రికా ప్రకటనలను జారీ చేస్తుందని వివరణ ఇచ్చారు.  ప్రజలు  రూ. 10 నాణేలపై ఎటువంటి సంకోచం లేకుండా లీగల్‌ టెండర్‌గా అంగీకరించాలని కోరారు. రూ. 10 నాణేంపై గతంలో కూడా ఆర్బీఐ అనేక సార్లు వివరణ ఇచ్చింది. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10 నాణెం మొత్తం 14 డిజైన్‌లు చెల్లుబాటు అవుతాయని , లావాదేవీలకు చట్టబద్ధమైన టెండర్ అని చెప్పింది. ఆర్బీఐ తొలిసారిగా రూ. 10  కాయిన్‌ను 2005లో ప్రవేశపెట్టింది.

చదవండి: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ రూపీ పరిమితి భారీగా పెంపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top