ఆఫీసుల వెరిఫికేషన్‌ నిబంధనలకు మార్పులు ..

Govt amends rules for physical verification of companies - Sakshi

న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం సంస్థల రిజిస్టర్డ్‌ చిరునామాలను అధికారులు భౌతికంగా ధృవీకరించుకునే నిబంధనలను కేంద్రం సవరించింది. వీటి ప్రకారం ఈ అంశంలో ఇకపై అధికారులు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ప్రసక్తి ఉండదు.

సాధారణంగా ఏదైనా సంస్థ సరైన రీతిలో వ్యాపారం నిర్వహించడం లేదని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ)కి అనుమానం కలిగినప్పుడు సదరు కంపెనీ రిజిస్టర్డ్‌ చిరునామాకు వెళ్లి భౌతికంగా వెరిఫికేషన్‌ చేయవచ్చు. తాజా మార్పుల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో కంపెనీ నమోదైన ప్రాంతంలో ఉండే ఇద్దరు స్వతంత్ర సాక్షులు ఉండాలి. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకోవచ్చని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తెలిపింది. అలాగే కార్యాలయం ఫొటోనూ తీసుకోవాలి. ప్రాంతం, ఫొటోలు సహా వివిధ వివరాలతో కూడిన నివేదికను సవివరంగా రూపొందించాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top