100 మంది మాజీ ఉద్యోగులకు గూగుల్‌ భారీ షాక్‌.. నష్టపరిహారం చెల్లించడం లేదంటూ

Google Stops Paying Remaining Maternity, Medical Leave Form Laid Off On Leave Group - Sakshi

మాజీ ఉద్యోగులకు గూగుల్‌ భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. మెటర్నిటీ, మెడికల్‌ లీవ్‌లో ఉండి..ఉద్యోగం కోల్పోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించబోవడం లేదని సమాచారం. అయితే గూగుల్‌ నిర్ణయం వెనుక గ్రూప్‌గా 100 మంది ఉద్యోగులే కారణమని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

గూగుల్‌లో పనిచేస్తున్న 100 మంది గ్రూప్‌గా ఉన్న ఉద్యోగులు Laid off on Leave తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ధిక అనిశ్చితితో గూగుల్‌ ఈ ఏడాది జనవరి 12వేల మందిని తొలగించింది. వారిలో ఆ 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి మెడికల్‌,పెటర్నిటీ బెన్ఫిట్స్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ ఉద్యోగులు మాత్రం సంస్థ ఆమోదించినట్లుగానే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఉద్యోగుల బృందం గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోతో సహా ఎగ్జిక్యూటివ్‌లకు లేఖ రాశారు. ఆ లేఖలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కానీ గూగుల్‌ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.  

గత సంవత్సరం గూగుల్‌ ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులకు లీవ్‌ల సమయాన్ని పెంచింది. పేరంటల్‌ లీవ్‌ కింద 18 వారాలు, బర్త్‌ పేరెంట్స్‌కు 24 వారాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పైగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అసాధారణ ప్రయోజనాలను అందించాలని భావించింది. 

అనూహ్యంగా గూగుల్‌ 12వేల మం‍దిని తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. గూగుల్‌లో పనిచేసిన యూఎస్‌ ఆధారిత ఉద్యోగులకు ప్రతి సంవత్సరానికి 16 వారాల అదనపు వేతనంతో పాటు రెండు వారాలు అందించనుంది. ఈ చెల్లింపు నిబంధనలు గడువు మార్చి 31 వరకు విధించింది. ఈ తరణంలో మెడికల్ లీవ్‌లో ఉన్నప్పుడు తొలగించిన తమకు చెల్లింపులు అంశంలో స్పష్టత ఇవ్వాలని మాజీ ఉద్యోగులు గూగుల్‌ను  కోరుతున్నారు. సంస్థ స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top