గూగుల్‌ హెచ్చరిక..! యాప్స్‌ను అప్‌డేట్‌ చేయండి..లేకపోతే!

Google to remove nearly 900K abandoned apps from Play Store - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌.. యాప్స్‌ యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్లేస‍్టోర్‌లో ఉన్న యాప్స్‌ను అప్‌డేట్‌ చేయాలని, లేదంటే వాటిని తొలగిస‍్తామని తెలిపింది. అయితే గూగుల్‌ హెచ్చరించిన యాప్స్‌ డెవలపర్లు పట‍్టించుకోకపోవడంతో సుమారు ప్లే స్టోర్‌లో ఉన్న సుమారు 9లక్షల యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది.

  

గూగుల్‌ ప్లేస్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్‌ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ ను తొలగించేందుకు ఆ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నుంచి అప్‌డేట్‌ కానీ యాప్స్‌ను అప్‌డేట్‌ చేయాలని వాటి డెవలపర్లకు గూగుల్, యాపిల్ వార్నింగ్ ఇచ్చాయి.

విధించిన గడువులోపే యాప్స్‌ను అప్‌డేట్‌ చేయాలని గూగుల్‌తో పాటు యాపిల్‌ సైతం హెచ్చరించాయి.

అయినా డెవలపర్లు పట్టించుకోకపోవడంతో వాటిని డిలీట్‌ చేయనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top