గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్‌ ఉద్యోగి భావోద్వేగం 

Google India Lays Off Employee After Awarding Him Star Performer Of The Month - Sakshi

సాక్షి, ముంబై:  టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగాల  తీసివేత ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికిన సంస్థలో తాజా ఆకస్మిక తొలగింపులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగాలదీ ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. సోషల్‌ మీడియాలో గుండెల్ని పిండేస్తున్న కథనాలు, పంచుకుంటున్న అనుభవాలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన గూగుల్‌ ఉద్యోగి ఆవేదన ఆ కోవలో నిలిచింది. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచినా కూడా ఉద్యోగంనుంచి తొలగించారంటూ హర్ష్ విజయ్ వారిగ్య తన ఆవేదనను పంచుకున్నారు.  (91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్‌ షీనా లవ్‌లో బిజినెస్‌ టైకూన్‌)

గూగుల్ ఆపరేషన్స్ సెంటర్‌లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య.  ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఈ సంతోషంనుంచి తేరుకోకముందే కంపెనీ షాక్‌ ఇచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చూసి నివ్వెరపోయిననాయన లింక్డ్‌ఇన్‌ సుదీర్ఘమైన పోస్ట్‌లో తన అనుభవాన్ని షేర్‌ చేశారు. పాప్-అప్ ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన గుండె ఆగినంత పని అయిపోయిందనీ, ''స్టార్'' పెర్ఫార్మర్‌ని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ తనను తొలగించింది. ఎందుకిలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతేకాదు సంస్థలోని తొలగింపు ప్రభావం ఎలా ఉండబోతోందో వెల్లడించారు.  ఇకపై వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే.. ఫైనాన్షియల్‌ ప్లాన్స్‌ అన్నీ ఆగమైపోయాయని పేర్కొన్నారు, ఈ షాక్‌నుంచి తేరుకుని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని, ఇపుడిక తన మనుగడ కోసం పోరాడాల్సి ఉందని  పేర్కొన్నారు హర్ష్ విజయ్ వారిగ్య.

కాగా గురుగ్రామ్‌లోని గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆకృతి వాలియా ఇటీవలే తొలగించింది సంస్థ. సంస్థలో తన 5 సంవత్సరాల-గూగుల్‌వర్సరీ వేడుకలను జరుపుకున్న సంతోషంలో ఉండగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ దర్శనమిచ్చింది. మీటింగ్‌కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థంకావడం లేదంటూ లింక్డ్ ఇన్‌లో పోస్ట్‌లో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top