మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం

Good news for train passengers Indian Railways reduces fare of AC3 tier economy class ticket - Sakshi

సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే  వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి  ఇది చల్లటి కబురే.

రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్‌ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌  చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని  ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి  ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్‌లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. 

(ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్‌: ఏ మోడల్‌ అయినా బాదుడే!)
 
ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన  తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే  రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది.

(సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు)

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top