rail ticket
-
రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
భారతీయ రైల్వే సాంకేతిక విప్లవంలో మరో అడుగు ముందుకేస్తూ ఇటీవల విడుదల చేసిన సూపర్ యాప్ ‘రైల్‌వన్’ ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్రిజర్వ్డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) రూపొందించిన ఈ రైల్‌వన్ యాప్.. అసలు గతంలో ఉన్న ఐఆర్సీటీసీ యాప్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? రైల్వే శాఖ దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? అనే పూర్తి వివరాలపై విశ్లేషణ.అసలు రైల్‌వన్ యాప్‌ను రైల్వే శాఖ ఎందుకు తీసుకొచ్చింది?గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు.రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్‌ఫ్రీ ఇంటర్ఫేస్ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ.. రైల్‌వన్ మధ్య ప్రధాన తేడాలుచాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్‌లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.ఫీచర్ఐఆర్సీటీసీ (రైల్ కనెక్ట్)రైల్ వన్నిర్వహణఐఆర్సీటీసీ ప్రభుత్వ అనుబంధ కార్పొరేట్ సంస్థ).క్రిస్ (రైల్వే శాఖ పరిధిలోని ఐటీ విభాగం).టికెట్ల లభ్యతప్రధానంగా రిజర్వ్డ్ రైలు టికెట్లు (కన్ఫర్మ్డ్, తత్కాల్) మాత్రమే.రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్లు అన్నీ లభిస్తాయి.రిజర్వేషన్ ప్రక్రియఐఆర్సీటీసీ సొంత గేట్‌వే, లాగిన్ ద్వారా బుకింగ్ జరుగుతుంది.ఐఆర్సీటీసీ అథరైజ్డ్ పార్ట్నర్లుగా ఉంటూనే దాని సర్వర్‌ను అనుసంధానించి వేగంగా బుక్ చేస్తుంది.లైవ్ ట్రాకింగ్, రూట్లుకొంత పరిమితంగా ఉంటుంది లేదా వేరే థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాలి.లైవ్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, స్టేషన్ క్యూఆర్ కోడ్స్ ఇన్-బిల్ట్‌గా ఉంటాయి.రైల్ మదద్ఈ యాప్‌లో ఫిర్యాదుల వ్యవస్థ నేరుగా సమగ్రంగా ఉండదు.యాప్‌లోనే ఇన్-బిల్ట్‌గా ఫిర్యాదులు చేయడం, వాటి స్టేటస్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.యూజర్ అనుభవంయాప్లో యాడ్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు పేజీ లోడింగ్ నెమ్మదిస్తుంది.యాప్ ఫ్రీ ఇంటర్ఫేస్, బయోమెట్రిక్ లాగిన్ చాలా వేగంగా పనిచేస్తుంది.రైల్‌వన్ యాప్‌లోని టాప్ ఫీచర్లుపేపర్లెస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్: రైల్వే స్టేషన్ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్రిజర్వ్డ్, నప్లాట్ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు (ఉదాహరణకు 3% వరకు) కూడా లభిస్తాయి.ఫుడ్ ఆర్డర్: ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ వెరిఫైడ్ పార్ట్నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.ఆర్-వాలెట్: ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు.మల్టీ ల్యాంగ్వేజీ: ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌ను వాడుకునే సదుపాయం ఉంది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!
భారత రైల్వే టికెటింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కో ఆపరేషన్ (ఐఆర్సీటీసీ)కి చెందిన ఈ-టికెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అధికారిక వెబ్సైట్, యాప్ సేవలను దాదాపు గంటసేపు నిలిపేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది.‘వెబ్సైట్ నిర్వహణ పనుల వల్ల అధికారిక వెబ్సైట్, యాప్‌లు నిలిచిపోయాయి. ఈ-టికెట్ సేవలకు మరో గంటపాటు అంతరాయం కలుగుతుంది. టికెట్లకు సంబంధించి ఏదైనా పరిష్కారాల కోసం తర్వాత ప్రయత్నించండి. మరేదైనా సమస్యల కోసం etickets@irctc.co.inకు మెయిల్ చేయండి. ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755-4090600కు సంప్రదించండి’ అని ఐఆర్సీటీసీ తెలిపింది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు The Most Pathetic Service from @IRCTCofficial , When Can we expect an Improvement? are we so incompetent that cant handle the traffic on the #irctc app and website. when talking about the development but the foundation is very weak which is your server which is down all d time. pic.twitter.com/VpxRw8GemC— Chintan Raval (@ChintanRaval1) December 9, 2024స్టేటస్ ట్రాకింగ్ సాధనం డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఐఆర్సీటీసీ వినియోగదారులు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు 50 శాతం వెబ్సైట్ వినియోగదారులు సైట్, యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. దాంతో చాలామంది వినియోగదారులు విభిన్న సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. -
మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి ఇది చల్లటి కబురే. రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. (ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!) ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) -
త్వరలో రైల్వే టికెట్లపై డిస్కౌంట్లు!
న్యూఢిల్లీ: విమానాలు, హోటళ్ల తరహాలోనే త్వరలో సీట్లు భర్తీకాని రైళ్లలో టికెట్ ధరలో డిస్కౌంట్ అందజేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్.. డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. భర్తీకాని రైళ్లలో టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించడంపై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వినీ లోహానీ అనుభవం తమకు ఉపయోగపడుతుందన్నారు. పండుగ సీజన్లలో, వారాంతాల్లో, రద్దీ తక్కువగా ఉండేకాలంలో టికెట్ ధరల్ని సవరించేందుకు ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీలను అమర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
ఇక రైల్ టికెట్ తీసుకోవడం ఈజీ : డీఆర్ఎం
కృష్ణా(విజయవాడ): రైల్వేలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశామని డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ఇక నుంచి అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లను వెండింగ్మిషన్ ద్వారా సులభంగా పొందొచ్చని సూచించారు. ఈ మిషన్లలో ఏప్రాంతానికైనా టికెట్ పొందే అవకాశం ఉంటుందని దీని పేర్కొన్నారు. డివిజన్లో 17 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లును ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో 8, తెనాలి, నెల్లూరు, రాజమండ్రి, కొవ్వురులో మిగిలినవి ఏర్పాటుచేశామని వివరించారు. విజయవాడ మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద నాలుగు, తూర్పు, దక్షిణ ప్రవేశ ద్వారాల వద్ద రెండేసి మెషిన్లను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రయాణికులు రూ.50 చెల్లించి స్మార్ట్ కార్డు కూడా పొందొచ్చన్నారు. ఈ కార్డు ఏడాది పాటు వినియోగంలో ఉంటుందని, దాని సాయంతో దక్షిణ మధ్య రైల్వేలో అన్ రిజర్వుడు టికెట్లను ఏప్రాంతానికైనా తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్డును రూ.50 నుంచి రూ.5 వేల వరకూ రీచార్జిచేసుకోవచ్చని తెలిపారు. -
ఇకపై ఇంటివద్దకే రైల్వే టిక్కెట్టు


