
అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారీగా పెరిగి.. లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే టారిఫ్ భయం తగ్గుతోంది. ఇటీవలే అమెరికా - చైనా వంటి దేశాలు టారిఫ్‌లను 115 శాతం తగ్గించుకున్నాయి.
ఈ రోజు కూడా బంగారం ధరలు భారతదేశంలో గరిష్టంగా రూ.2130 తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కేజీ బంగారం రూ. 97000 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్‌గోల్డ్ ఔన్సు 16 డాలర్లు తగ్గి.. 3160 డాలర్ల వద్ద ట్రేడయింది. వెండి ఔన్స్ 32 డాలర్ల వద్ద కొనసాగింది. ఏప్రిల్ 2025లో ఔన్స్ 3500 డాలర్ల వరకు వెళ్ళింది.
ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం
ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధర 10 శాతం తగ్గింది. తాజాగా గోల్డ్ 3150 డాలర్ల స్థాయికి చేరింది. ఇండియన్ మార్కెట్లో కూడా లక్ష రూపాయలు దాటేసింది బంగారం సుమారు 7000 రూపాయల కంటే ఎక్కువ తగ్గింది. అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయం ఒక ఒప్పందానికి రావడం, ఇండియా - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గడం వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారమైనట్లు తెలుస్తోంది.