అబ్బబ్బే అలాంటిదేం లేదు, క్లారిటీ ఇచ్చిన గౌతమ్‌ అదానీ

Gautam Adani Denies Report On Opening Family Office In Dubai Or New York - Sakshi

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్ని విదేశాల్లో ప్రారంభించే యోచనలో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలపై గౌతమ్‌ అదానీ స్పందించారు. తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ బిజినెస్‌, ఇతర కార్యకాలపాల్లో విదేశాల్లో సంస్థల్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.  

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం..
ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ, అదానీ కుటుంబ సభ్యులు వారి వ్యక్తి గత సంపదను విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది. ఇందుకోసం అదానీ దుబాయ్‌, న్యూయార్క్‌లో కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.   

అంతేకాదు అదానీ కుటుంబ సభ్యుల కోసం ఓవర్‌సిస్‌ ఆఫీస్‌లలో పనిచేసేందుకు మేనేజర్ల నియామకాలు జరుపుతున్నట్లు హైలెట్‌ చేసింది. ఈ వార్తలపై అదానీ యాజమాన్యం, అదానీ అధినేత గౌతమ్‌ అదానీ స్పందించారు. కుటుంబ సభ్యుల వ్యాపార వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వార్తల్ని ఖండించారు. ఈ వదంతులపై అదానీ యాజమాన్యం స్పష్టతనిస్తూ ఓ నోట్‌ను విడుదల చేయడంపై రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లైంది. 

ధనవంతుల జాబితాలో 
బ్లూమ్‌ బెర్గ్‌ ఇండెక్స్‌ ప్రకారం..ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తొలిస్థానం, బెర్నార్డ్ అర్నాల్ట్ రెండవ స్థానంలో ఉండగా.. గౌతమ్‌ అదానీ 132 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 3వ స్థానంలో కొనసాగుతున్నారు.

చదవండి👉  ‘అదానీ సంపద హాంఫట్‌’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top