ఐపీవో దిశలో రెండు కంపెనీలు

Gandhar Oil Refinery, Bharat Highways Ready To IPO - Sakshi

జాబితాలో భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌

గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ సైతం..

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ భారత్‌ హైవేస్‌ ఇన్విట్, వైట్‌ ఆయిల్స్‌ తయారీ కంపెనీ గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా..

రూ. 2,000 కోట్లకు రెడీ
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌ బుక్‌బిల్డింగ్‌ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్‌ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్‌ ఎస్‌పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఎస్‌పీవీ ప్రాజెక్టŠస్‌లో.. పోర్‌బందర్‌– ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, వారణాశి– సంగమ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్‌ సంగ్లీ– సోలాపూర్‌ హైవే, జీఆర్‌ అక్కల్‌కోట్‌– సోలాపూర్‌ హైవే, జీఆర్‌ ఫగ్వారా ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్‌ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్‌లో ఏర్పాటైన భారత్‌ హైవేస్‌ ఇన్విట్‌ ప్రాజెక్ట్‌ ఎస్‌పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది.

రూ. 500 కోట్లపై కన్ను
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్‌ ఆయిల్‌ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్‌ వర్క్‌లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్‌ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్‌ ఆయిల్స్‌ తయారీకి మరిన్ని బ్లెండింగ్‌ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top