ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లకు ఆర్‌ఐఎల్‌ జోష్‌

Future group shares jumps on Reliance industries deal news - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డీల్‌ ఎఫెక్ట్‌

ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లకు భారీ డిమాండ్‌

20-5 శాతం మధ్య జంప్‌చేసిన షేర్లు

పతన మార్కెట్లోనూ లాభాలతో కళకళ

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)తో డీల్‌ కుదుర్చుకున్న నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 20-5 శాతం మధ్య జంప్‌చేశాయి. లడఖ్‌ తూర్పు ప్రాంతంలో సరిహద్దు వద్ద చైనా బలగాలతో తిరిగి సైనిక వివాదాలు తలెత్తినట్లు వెలువడిన వార్తలు మార్కెట్లను ఒక్కసారిగా దెబ్బతీశాయి. అయినప్పటికీ ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ బిజినెస్‌.. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో చేరనుండటంతో ఈ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈ డీల్‌పై అంచనాలతో ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతున్న విషయం విదితమే.

షేర్ల జోరు
ఆర్‌ఐఎల్‌తో డీల్‌ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఫ్యూచర్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలన్నీ అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ రిటైల్‌ 20 శాతం దూసుకెళ్లి రూ. 162కు చేరగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 153ను చేరింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 5 శాతం ఎగసి రూ. 21 వద్ద, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ 5 శాతం బలపడి రూ. 159 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 28 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్‌ కన్జూమర్‌ 5 శాతం పుంజుకుని రూ. 12 వద్ద కదులుతోంది.

రూ. 24,713 కోట్లు
వారాంతాన కుదర్చుకున్న డీల్‌లో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌లతోపాటు.. లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ విభాగాలను ఆర్‌ఐఎల్‌ రూ. 24,713 కోట్లకు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్‌ చైన్‌ బిగ్‌బజార్‌సహా.. ఫుడ్‌హాల్‌, క్లాతింగ్‌ చైన్‌ బ్రాండ్‌ ఫ్యాక్టరీలను ఫ్యూచర్‌ గ్రూప్‌ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల నిర్వహణకు ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ కన్జూమర్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌, ఫ్యూచర్‌ సప్లైచైన్‌ సొల్యూషన్స్‌ను కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top