ఫండ్స్‌ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు | FundsIndia Hits Rs 25000 Crore AUM Milestone Records 58pc Annual Growth | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు

Mar 30 2026 8:38 AM | Updated on Mar 30 2026 9:13 AM

FundsIndia Hits Rs 25000 Crore AUM Milestone Records 58pc Annual Growth

బెంగళూరు: ఫండ్స్‌ ఇండియా రూ.25,000 కోట్ల నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏయూఎం రూ.20వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు వృద్ధి చెందడందో ఇది సాధ్యపడింది. ముఖ్యంగా ఏడాది కాలంలో నిర్వహణ ఆస్తులు 58 శాతం పెరగ్గా.. మూడేళ్లలోనూ ఏటా 38 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు సంస్థ ప్రకటించింది.

గత 12 నెలల్లో ఫండ్స్‌ ఇండియా రూ.2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు చెందినవే. 23 శాతం మేర ధనవంతులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 30 లక్షల యూజర్లకు ఫండ్స్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది.  సిప్‌ బుక్‌ రూ.142 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement