HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు

Four companies race to bag orr 30 years lease telugu details - Sakshi

హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది.

ఈ రేసులో ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్‌లను ఇప్పటికే హెచ్‌ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఎల్‌అండ్‌టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్‌లలో ఈ సంస్థలు పాల్గొనలేదు.

బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్‌పోర్ట్ కోసం హెచ్‌ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు.

ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్‌లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్‌పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 

బిడ్‌లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్‌ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్‌ఎండీఏ ఈగిల్ ఇన్‌ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌పర్‌పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్‌ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్‌పోర్ట్' (TOT)ని స్వీకరించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top