ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ వేగవంతం చేయండి

FM Nirmala Sitharaman sets out three principles for income tax officials - Sakshi

ఐటీ అధికారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్‌ల (ఐటీఆర్‌) ప్రాసెసింగ్‌ను, రిఫండ్‌ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు  అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు.   

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్‌ :  ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) డైరెక్టర్‌ నితిన్‌ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్‌ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు.

జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్‌ ఈ పోర్టల్‌ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్‌ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్‌ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్‌ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని  రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.  ఇందులో కార్పొరేట్‌ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top