ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్ 

Flipkart Black Friday Sale Begins - Sakshi

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ తర్వాత మరో కొత్త సేల్ తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ యొక్క బ్లాక్ ఫ్రైడే సేల్ నేటి నుండి నవంబర్ 30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు గత సేల్ లో ఆఫర్లు, డిస్కౌంట్లను కోల్పోయినట్లయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మళ్ళి మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ ను పొందటానికి మరొక అవకాశాన్ని కల్పించింది. ఈ-కామర్స్ దిగ్గజం ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇఎంఐ లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బ్లాక్ ఫ్రైడే అమ్మకం సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ అందిస్తున్నాం. (చదవండి: మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్)

ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ఇవే..

► ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకం సమయంలో రూ. 38,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను అసలు ధర కన్నా రూ.10,000 తగ్గింపుతో విక్రయిస్తోంది. దీని యొక్క అసలు ధర రూ .47,900. మీ దగ్గర కనుక పాత ఐఫోన్ ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.14,100 వరకు తగ్గింపును పొందవచ్చు. 

► ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలలో భాగంగా మోటో జి9 రూ.9,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్ మరియు 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పనిచేస్తుంది.

► ఫ్లిప్‌కార్ట్ కొన్ని రియల్‌మీ ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్‌మీ నార్జో 20 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హిలియో జి95 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇది 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. దీని వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 

► శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 + ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ. 49,999కు లభిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ  కెమెరా మరియు డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

► గూగుల్ పిక్సెల్ 4ఎ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే అమ్మకంలో భాగంగా రూ.31,999కు లభిస్తుంది. ఇది 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 5.81-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. పిక్సెల్ 4ఎలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. 

► శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ను ప్రస్తుతం రూ.54.999కి అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అసలు ధర రూ. 79,999కు లభిస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ డీల్. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభిస్తుంది. 

► ఐఫోన్ SE 2020 మీరు ఐఫోన్ కొనాలనుకుంటే, ఇది ఉత్తమ సమయం. ఐఫోన్ SE 2020ను రూ. 32,999కు కొనుగోలు చేయవచ్చు. దీని 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ అసలు ధర. 42,500 రూపాయల నుండి తగ్గింది. ఈ ఐఫోన్‌పై మీకు 9,501 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ మోడల్ రూ.14,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top