దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న రాష్ట్రాలు ఇవే : నీతి ఆయోగ్‌ | Sakshi
Sakshi News home page

దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న రాష్ట్రాలు ఇవే : నీతి ఆయోగ్‌

Published Fri, Nov 26 2021 7:07 PM

Five Poorest States In India Said Niti Aayog - Sakshi

నీతి ఆయోగ్‌కు చెందిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) పై రిపోర్ట్లు విడుదలయ్యాయి. ఈ రిపోర్ట్‌లలో దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలు దేశంలో అత్యంత పేద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.  

నివేదిక ప్రకారం..ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (OPHI),యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)ల ఆధ్వర‍్యంలో సర్వే జరిగింది. ఈ రెండు సంస్థలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, పోషకాహారం, పిల్లలు, కౌమర దశలోని మరణాలు, ప్రసవానంతర సంరక్షణ, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట గ్యాస్‌, పారిశుద్ధ్యం, మద్యపానం వంటి 12 అంశాల ఆధారంగా దేశంలోని ఏఏ రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయనే విషయాల్ని వెల్లడిస్తాయి.

 

ఆ సంస్థలు చేపట్టిన అభిప్రాయ సేకరణ ఆధారంగా బీహార్‌లో 51.91 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు అభిప్రాయం సేకరణలో వెల్లడైంది. ఇక బీహార్‌ తరువాత  జార్ఖండ్‌ 42.16 శాతంతో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌ 37.79 శాతంతో మూడో స్థానంలో, మధ్యప్రదేశ్ 36.65 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, మేఘాలయ 32.67 శాతం ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత కేరళ 0.71 శాతం, గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతంతో దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 

చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిదపాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement