Layoffs In 2023: నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!

In The First Half Of 2023, There Will Be Fewer Layoffs Said Naukri Survey - Sakshi

ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్‌ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  

ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్‌ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్‌ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్‌ సంస్థ నౌకరీ..  1400 మంది రిక్రూట్లు, జాబ్‌ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్‌ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్‌ .. ఫ్రెషర‍్ల రిక్రూట్‌ మెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు.  

ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్‌ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో  గ్లోబుల్‌ మార్కెట్‌లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్‌మెంట్‌ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 

2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్‌లను పొందవచ్చని అంచనా.  సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్‌లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్‌ సెలక్షన్‌లు ఎక్కువ జరుగుతాయని సమాచారం.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top