ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు

FDI Rises 40 Percent To 51 Billion Dollars in Apr Dec 2020 21 - Sakshi

కరోనా మహమ్మారి వంటి క్లిష్ట కాలంలో కూడా భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జోరు పెరిగింది. 2020-21 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) 40 శాతం పెరిగి 51.47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నేడు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. 

"2020-21 మొదటి తొమ్మిది నెలల్లో (51.47 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహం 40 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే(36.77 బిలియన్ డాలర్లు) ఇది అధికం" అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020-21 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2020) ఈ ప్రవాహం 37 శాతం పెరిగి 26.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డిసెంబరులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 24 శాతం పెరిగి 9.22 బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో దేశంలోకి వచ్చాయి. గత ఆరున్నర సంవత్సరాలలో తీసుకున్న ఎఫ్‌డిఐ విధాన సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్య విధానాలతో దేశంలోకి ఎఫ్‌డిఐల ప్రవాహం పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

చదవండి:

అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top