2 నెలల్లో పసిడి ధర ఎంత తగ్గిందంటే..

ఈ ఏడాది బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కిందకు దిగొస్తున్నాయి. 2021 జనవరి 5న గరిష్టంగా రూ.52,360 ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,600కు చేరుకుంది. అంటే కేవలం రెండు నెలల్లోనే రూ.6,760 పడిపోయింది. బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం అని, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే ధరలు మళ్లీ పెరగొచ్చని మార్కెట్ వర్గాల నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లు కూడా ఇతర మార్కెట్ వైపు వెళుతుండడంతో వీటి ధరలు పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 మేర తగ్గి రూ.41,800కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,400 మేర తగ్గి రూ.70,400 చేరుకుంది.
చదవండి: