Falguni Nayar Bagged EY Entrepreneur of the Year Award 2021 - Sakshi
Sakshi News home page

Nykaa CEO Falguni Nayar: నైకా ఫాల్గుని నాయర్‌ ఖాతాలో మరో ఘనత

Apr 13 2022 11:31 AM | Updated on Apr 13 2022 12:18 PM

Falguni Nayar Bagged EY Entrepreneur of the Year Award 2021  - Sakshi

చిన్న వయసులోనే సెల్ఫ్‌మేడ్‌ బిలియనీర్‌గా రికార్డు సృష్టించిన నైకా ఫౌండర్‌ ఫాల్గుని నాయర్‌ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఎంటర్‌ప్యూనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 (ఈవై) అవార్డు గెలుచుకున్నారు. రెగ్యులర్‌ మార్కెట్‌లో మాత్రమే అమ్ముడయ్యే సౌందర్య ఉత్పత్తులను ‘నైకా’తో ఈ కామర్స్‌లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించారు ఫాల్గుని నాయర్‌. అంతేకాదు గతేడాది నైకా ఐపీవోకి బంపర్‌ హిట్‌ సాధించింది. రాత్రికి రాత్రే ఫాల్గుని నాయర్‌ బిలియనీర్‌గా మారింది. గత నాలుగు నెలలుగా మార్కెట్‌లో అస్థితర నెలకొన్నా నైకాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. జూన్‌లో జరగబోయే వరల్డ్‌ ఎంటర్‌ప్యూనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కార్యక్రమంలో ఆమె ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఎల్‌ అంట్‌ టీ చైర్మన్‌ ఎఎం నాయక్‌కి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ ప్రకటించింది ఈవీ సంస్థ. 1965లో ఎల్‌ అంట్‌ టీలో చేరిన నాయక్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ 2003లో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయంలో ఎల్‌ అండ్‌ టీ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రపంచ వ్యాప్తంగా చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement