అమెజాన్‌ బాస్‌ మెడకు ‘ఏలియన్‌’ లింక్‌! | Fact Check On During Space Trip Aliens Replaced Jeff Bezos | Sakshi
Sakshi News home page

Amazon: అమెజాన్‌ బాస్‌ మెడకు ‘ఏలియన్‌’ లింక్‌! ‘కిడ్నాప్‌’ ‘కుట్ర’ అంటూ..

Jul 25 2021 2:06 PM | Updated on Jul 25 2021 2:22 PM

Fact Check On During Space Trip Aliens Replaced Jeff Bezos - Sakshi

కొందరు ఎదుటివాళ్ల సక్సెస్‌ను ఓర్చుకోలేరు. అమెరికాలో అలాంటి బ్యాచ్‌ ఒకటి ‘కుట్ర సిద్ధాంతకర్తలు’గా కొన్ని సంవత్సరాల నుంచి మనుగడ కొనసాగిస్తోంది. వీళ్లు అమెరికా ప్రభుత్వం, పౌరులు సాధించే ఓ విజయాన్ని భరించలేరు. వాటికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటారు. వీళ్లు చెప్పే థియరీలు ఒక్కోసారి తట్టుకోలేని రేంజ్‌లో ‘అబ్బో’ అనిపిస్తుంటాయి. అలాంటి ఓ థియరీని అమెజాన్‌ బాస్‌ మెడకు చుట్టేశారు. 
 
అంతరిక్షంలోకి వెళ్లొచ్చి వారం తిరగలేదు. అప్పుడే అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ గురించి తిక్క వార్తలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పేది ఏంటంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్‌ను ఏలియన్లు కిడ్నాప్‌ చేశాయట. ఆయన ప్లేస్‌లో ఏలియన్‌ డబుల్‌ బాడీని తిరిగి భూమ్మీదకు పంపించాయట. కావాలంటే ఆయన మెడ చూడడండి ఎలా సాగిలపడి ఏలియన్‌లా ఉందో అంటూ ఏవో ఆధారాలు చూపెడుతున్నారు వాళ్లు. 

ఈ థియరీని అమెజాన్‌ ‘ఛీ’ కొట్టేసింది. పదకొండు నిమిషాల గ్యాప్‌లో.. అదీ తోడుగా సభ్యులు ఉండగా జరిగిందన్న ఏలియన్‌ కిడ్నాప్‌ వ్యవహారం ఒక పిచ్చి వాదన అని అంతా తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు ఈ కిడ్నాప్‌ ద్వారా భూమ్మీద పట్టుసాధించాలని ఏలియన్లు ప్రయత్నిస్తున్నాయనే తట్టుకోలేని మరో వాదనను సైతం వీళ్లు లేవనెత్తుతున్నారు. ప్చ్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement