ఈవీ ట్రాన్స్‌కు భారీ కాంట్రాక్టు 

Evey Trans Private Limited Has Been Declared as the Least Quoted Bidder - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంటోంది. ఒక రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన టెండర్లలో 1,400 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు లోయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. మరో 700 బస్సులను అందించేందుకూ పోటీ పడుతోంది. ఈ రవాణా సంస్థకు అద్దె ప్రాతిపదికన 12 ఏళ్లపాటు బస్సులను నడుపుతారు.

ఆర్డర్‌ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) చేతికి రాగానే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి 1,400 బస్సులను ఈవీ ట్రాన్స్‌ కొనుగోలు చేయనుంది. ఈ బస్సుల విలువ రూ.2,450 కోట్లు. డీల్‌ కార్యరూపం దాలిస్తే ఒలెక్ట్రాకు ఇదే అతిపెద్ద ఆర్డర్‌గా నిలవనుంది. ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రెండూ కూడా మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీలు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top