Evaru Meelo Koteeswarulu: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!

Evaru Meelo Koteeswarulu to crown its first crorepati Raja Ravindra - Sakshi

Evaru Meelo Koteeswarudu 1 Crore Winner: కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న సంగతి మనకు తేలిసిందే. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. రాజారవీంద్ర ప్రైజ్ మ‌నీ గెలిచిన ఎపిసోడ్ సోమ‌, మంగ‌ళ వారాల్లో రాత్రి 8.30 గంట‌ల‌కు ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్‌.ఎస్‌ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్‌ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 

2000 - 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్‌ సుల్తాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేశారు. ఇదివరకు సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఎవరు మీలో కోటీశ్వరులు పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్న స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్రకు దక్కేది మాత్రం తక్కువ అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు.

అయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి‎‎ చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు. అంటే ‎‎ఎవరు మీలో కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. 

(చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top