ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

EPFO higher pension deadline Extended Check details - Sakshi

సాక్షి, ముంబై: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) అధిక పెన్షన్‌ కోసం  దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త.  దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు.  2023 మార్చి 3 తో  గడువు  ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో గడువును పొడిగించింది.  అధికారిక పోర్టల్‌ సమాచారం  ప్రకారం ఈ గడువు  మే 3 వ తేదీవరకు  ఉంది. ఈ  పరిధిలోని చందాదారులు, పెన్షన్‌దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్‌ కోసం  మే 3 తేదీ వరకు  అప్లయ్‌ చేసుకోవవచ్చు.  

(ఇదీ చదవండి:  ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ.. ‘అధిక పెన్షన్‌’కు ఏం చేయాలి?)

సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్‌ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది.  అయితే  తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ  ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గత నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి  దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్‌ఓ తన జోనల్‌ కార్యాలయాల్లోని అదనపు చీఫ్‌ ప్రావిడెంట్‌ కమిషనర్లు, ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top