ఆమ్వేకు భారీ షాక్‌ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్‌

Enforcement Directorate attaches Rs 757 crore worth assets of Amway India - Sakshi

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్‌ తగిలింది, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎటాచ్‌ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్‌ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్‌, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్‌ చేసింది. 

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్‌ మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్‌ ఇచ్చింది ఈడీ. 

చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్‌, టప్పర్‌వేర్‌.. డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీలకు షాక్‌ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top