1,000 మంది ఉద్యోగులను తొలగించిన మరో దిగ్గజ కంపెనీ! | eBay Company Laying Off Their 1000 Employees For This Reason, Know Details Inside - Sakshi
Sakshi News home page

eBay Layoffs 2024: 1,000 మంది ఉద్యోగాలు తొలగించిన మరో దిగ్గజ కంపెనీ!

Published Wed, Jan 24 2024 4:17 PM

Ebay Company Layoffs Their 1000 Employees - Sakshi

ఐటీ కంపెనీల్లో ఇటీవల కాలంలో ఉద్యోగాల తొలగింపు పదం తరచూ వినిపిస్తోంది. అమెరికా టెక్‌ కంపెనీలు మెటా, ట్విటర్‌, గూగుల్‌ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారత టెక్నాలజీ కంపెనీలు 2022తో పోలిస్తే అత్యధిక మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్లు ఇటీవలే లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ నివేదిక తెలిపింది. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉంది. 2024లో ఈ పర్వం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్  1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసనపలికే అవకాశం ఉన్నట్లు ఈబే ప్రెసిడెంట్, సీఈవో జామీ ఇయానోన్ పేర్కొన్నారు.

గత త్రైమాసికంలో కంపెనీ 1.3 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేసినప్పటికీ సంస్థలో కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ-మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. 

ఇదీ చదవండి: జనరేటివ్‌ ఏఐతో కొత్త ఉద్యోగాలు

కంపెనీ లక్ష్యాలకు వ్యతిరేకంగా పరిస్థితులు మారినప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దాంతో కంపెనీకు మరింత నష్టం వాటిల్లుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రధాన మార్పులు అవసరం అవుతాయి. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.

Advertisement
Advertisement