Who Is Javier Olivan: ఆలస్యానికి తావేలేదు.. మెటా కొత్త సీవోవో ఇతనే?

Details About Meta New COO Javier Olivan - Sakshi

చిన్న స్టార్టప్‌ నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఫేస్‌బుక్‌ను తీర్చడంలో మార్క్‌ జూకర్‌బర్గ్‌ అను నిత్యం శ్రమించాడు. కాలానుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త వర్చువల్‌ ప్రపంచం సృష్టించే పనిలో ఉత్సాహంగా ఉన్నాడు. ఇంతలో మెటాలో ఊహించని విధంగా వచ్చిన కుదుపును జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసే పనిలో ఉన్నాడు జుకర్‌బర్గ్‌. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తనలోని క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను మరోసారి ప్రపంచానికి చూపెట్టారు.

ఊహించని కుదుపు
ఫేస్‌బుక్‌ నుంచి మెటాగా మారే క్రమంలో ఎదురైన అనేక విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌ను రారాజుగా నిలిపారు మార్క్‌జుకర్‌బర్గ్‌. భవిష్యత్తును అంచనా వేస్తూ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ నుంచి మెటావర్స్‌ అనే సరికొత్త వర్చువల్‌ వరల్డ్‌ రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో జుకర్‌బర్గ్‌తో పాటు ఎంతగానో శ్రమించిన షెరిల్ శాండ్‌బర్గ్  అకస్మాత్తుగా మెటాకు గుడ్‌బై చెప్పారు. ఉన్నట్టుండి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పదవికి ఆమె రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా మెటా కుదుపులకు లోనైంది. షేర్ల ధరలకు కోతలు పడ్డాయి. 

షెరిల్‌ వారసుడెవరు
షెరిల్ శాండ్‌బర్గ్ మెటాను వీడి వెళ్లడం కంపెనీ పరంగానే కాకుండా వ్యక్తగతంగా కూడా జూకర్‌బర్గ్‌కి తీరని నష్టమే. షెరిల్‌ నిష్క్రమణపై జూకర్‌బర్గ్‌ తాజాగా విడుదల ప్రకటన సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మరోసారి తనలోని మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ని బయటకు తెచ్చారు జుకర్‌బర్గ్‌. ఓవైపు షెరిల్‌ తాలుకూ బాధను అనుభవిస్తూనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెటా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా జేవియర్‌ ఒలివన్‌ను నియమించారు.

ఎవరీ జేవియర్‌ ఒలివన్‌
స్పెయిన్‌కి చెందిన జేవియర్‌ ఓలివన్‌ (44) నవర్రా యనివర్సిటీ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. జపాన్‌కు చెందిన సీమెన్స్‌లో తన కెరీర్‌ ను ప్రారంభించాడు. ఫేస్‌బుక్‌లోకి 2007లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఫేస్‌బుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్ల సంఖ్య కేవలం 40 మిలియన్లు మాత్రమే. ఆ తర్వాత ఈ సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతూ ప్రస్తుతం 3.6 బిలియన్లకు చేరుకుంది. ఇందులో ఇండియా, జపాన్‌, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్‌ వంటి పెద్ద మార్కెట్లలో ఫేస్‌బుక్‌ పాతుకుపోవడంలో జేవియర్‌ కృషే ఎక్కువ. కాగా షెరిల్‌ లేని లోటు లేకుండా ఒలివన్‌ సంస్థను ముందుకు నడిపిస్తాడని మెటా నమ్మకంతో ఉంది.

చదవండి: Sheryl Sandberg: మెటా సీఓఓ పదవికి షెరిల్ శాండ్‌బర్గ్ రాజీనామా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top