ఢిల్లీ హైకోర్టులో ‘ఫ్యూచర్‌’కు ఎదురుదెబ్బ

Delhi HC Rejects Future Group Plea Seeking Termination of Arbitration Proceedings With Amazon - Sakshi

అమెజాన్‌కు అనుకూల రూలింగ్‌  

న్యూఢిల్లీ: సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) ముందు అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రారంభించిన మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్‌) చర్యలను రద్దు చేయాలంటూ ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌సీపీఎల్‌) చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

ఆర్బి­ట్రల్‌ ప్రొసీడింగ్స్‌లో మొదట దాఖలు చేసిన క్లెయిమ్‌ స్టేట్‌మెంట్‌ (ఎస్‌ఓసీ)కి అనుబంధంగా అమెజాన్‌ చేసిన అభ్యర్థనను అనుమతించే మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ ప్రత్యేక ఉత్తర్వును సవాలు చేస్తూ ఎఫ్‌సీపీఎల్‌  దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా హైకోర్టు న్యాయమూర్తి సీ హరి శంకర్‌ కొట్టివేశారు. రాజ్యాంగంలోని 227 అధికరణ ప్రకారం ఆర్ర్‌బిట్రల్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం కుదరదని న్యాయమూర్తి 47 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అయితే ఆయా పార్టీల మధ్య వివాదాల విషయంలో మెరిట్స్‌పై కోర్టు ఎటువంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయబోదని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top