Deepika Padukone: రోడ్డున పడుతున్నాం..దీపికా ఇటు చూడవా!

Deepika Padukone Backed Startup Fires 150 Employees Over Email - Sakshi

అవును. నిజమే. తాము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె ఏం చేస్తుందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిర్ధాక్షణ్యంగా విధుల నుంచి తొలగిస్తే తమ కుటుంబ సభ్యుల బాగోగులు ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.     
 
2015లో బెంగళూరు కేంద్రంగా గౌరవ్‌ ముంజాల్‌, హిమేష్‌ సింగ్‌, రోమన్‌ సైనా, సచిన్‌ గుప్త'లు ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ అన్‌ అకాడమీని స్థాపించగా..అందులో ‌బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణె  ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఆ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగాయి.

మరో ప్రత్యర్ధి సంస్థ బైజూస్‌కు గట్టి పోటీ కూడా ఇచ్చింది. కానీ వరుస నష్టాలు ఆసంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు గతనెలలో అన్‌ అకాడమీ కాస్ట్‌ కటింగ్‌ పేరుతో 1000మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసింది. దీంతో పనిగంటల పేరుతో యాజమాన్యం తమ(ఉద్యోగుల) తో వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఉద్యోగులు ఆరోపించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.  

 మాజీ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతుండగానే..ఆ సంస్థ మరోసారి 150 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్‌ చేసింది. మూడు రోజుల్లో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 450 నుండి 100కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

"మే 27న చాలా మంది ఉద్యోగులకు మెయిల్స్‌ వచ్చాయి. ఆ మెయిల్స్‌లో మీ సేవలు మాకు అవసరం లేదని వివరిస్తూ పేర్కొన్నట్లు" పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగి తెలిపాడు". 

"మాకు వచ్చిన మెయిల్స్‌ చూసిన మా సహచర ఉద్యోగులు సైతం రిజైన్‌ చేశారు. ఎందుకంటే సాధారణంగా చాలా స్టార్టప్‌లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అంతెందుకు అన్‌ అకాడమీలో మే 27న 450 మంది ఉద్యోగులు ఉండగా వారి సంఖ్య 100కి చేరిందని”మరో ఉద్యోగి తెలిపాడు. కాగా, తమని తొలగిస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కనీసం నోటిస్‌ సర్వ్‌ చేయమని అడగలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా,తమని విధుల నుంచి తొలగిస్తున్న సంస్థ ఏంజెల్‌ ఇన్వెస్టరైన దీపికా పదుకొణే సైలెంట్‌గా ఎందుకు ఉన్నారో చెప్పాలంటూ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.సంస్థ కోసం కష్టపడి పని చేసిన ఉద్యోగుల్ని ఇలా అర్దాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుండగా..ఇప్పటికైనా తొలగించిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

చదవండి👉  చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్‌అకాడమీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top