Mass Layoffs at Unacademy: చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్‌అకాడమీ!

Unacademy laid off around 1,000 employees - Sakshi

ప్రముఖ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ 'అన్‌అకాడమీ' తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. అందులో పనిచేస్తున్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ ​ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయలేదని కారణంతో ఫైర్‌ చేసినట్లు ఉద్యోగులు వాపోతుండగా..గత రెండు నెలలుగా కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగుల‍్ని తొలగిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్‌అకాడమీ సంస్థ.. ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ అన్‌అకాడమీలో ప్రస్తుతం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ మొత్తం కలిపి 6వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1000మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. వారిలో 300మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తొలగింపుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల (ఉద్యోగులు) పట్ల అన్‌ అకాడమీ మేనేజ్మెంట్‌ దారుణంగా వ్యవహరిస్తుందని వాపోయారు. రోజుకి 12 నుంచి 14 గంటల పనిచేయాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్‌ఆర్‌ విభాగం తెలిపినట్లు చెప్పారు. కానీ ఇలా తమని అర్ధాంతరంగా తొలగించడంపై సమాచారం ఇవ్వలేదన్నారు. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని హెచ్‌ఆర్‌ విభాగం ప్రతినిధుల్ని అడగ్గా.. పొంతనలేని సమాచారం ఇచ్చినట్లు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


 
అన్‌అకాడమీ యాజమాన్యం వెర్షన్‌ ఇలా ఉంది  
న్యూ ఎడ్యుకేషన్‌ కేటగిరి, ప్రొడక్ట్‌ విభాగాల్లో విస్తరించాలని ఈ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా పర్ఫామెన్స్‌ చూపించని ఉద్యోగుల్ని తొలగించి వారి స‍్థానంలో కొత్త వారిని సెలక్ట్‌ చేసుకుంటుంది. ఇప్పటికే తొలగింపు నిర్ణయం అంశంపై ఉద్యోగులకు సమాచారం అందించామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగుల పనితీరు బాగలేదంటే..మెరుగు పరుచునేందుకు కొంత సమయం ఇచ్చినట‍్లు, అప్పటికీ వారి ఫర్మామెన్స్‌ అలాగే ఉంటే తొలగిస్తున్నట్లు అన్‌అకాడమీ ప్రతినిధులు తెలిపారు.

బైజూస్‌కు పోటీగా 
2015లో బెంగళూరు కేంద్రంగా గౌరవ్‌ ముంజాల్‌, హిమేష్‌ సింగ్‌, రోమన్‌ సైనా, సచిన్‌ గుప్త'లు ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ అన్‌అకాడమీని స్థాపించారు. సంస్థ ప్రారంభంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్ధులు ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్‌తో పాటు ఇతర కాంపిటిటీవ్‌ ఎగ్జామ్స్‌ కోసం ఉచిత ఆన్‌లైన్‌ క్లాసుల్ని విద్యార్ధులకు అందించింది. దీంతో ఎడ్యుకేషన్‌ మార్కెట్‌లో అన్‌అకాడమీ  మంచి పేరు సంపాదించింది. అలా 2019లో స‌బ్ స్క్రిప్ష‌న్‌, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే సర్వీసుల్ని ప్రారంభించి..కాంపిటీటరైన మరో ఎడ్యుకేషన్‌ సంస్థ బైజూస్‌కు గట్టిపోటీ ఇచ్చింది.

             

ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది 
బైజూస్‌కు పోటీగా ఎడ్యుకేషన్‌ మార్కెట‍్లో సత్తా చాటడంతో  అన్‌అకాడమీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఫేస్‌బుక్, టైగర్ గ్లోబల్, టెమాసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్‌బ్యాంక్, బ్లూమ్ వెంచర్స్, సీక్వోయా, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, ఎలివేషన్ క్యాపిటల్ పెట్టుబడిదారులతో ఇప్పటి వరకు దాదాపు $800 మిలియన్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం ఈ స్టార్టప్ విలువ 3.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అన్‌అకాడమీ ప్రధాన ప్రత్యర్థి బైజూస్‌తో పోటీపడుతుండగా..ప్రస్తుతం, బైజూస్ మార్చి 2022లో ఇటీవలి ఫండింగ్ రౌండ్‌లో $22 బిలియన్లతో భారతదేశంలో అత్యంత విలువైన ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌గా నిలిచింది. 

11సంస్థల్ని సొంతం చేసుకుంది
పేరుతో పాటు ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో అన్‌అకాడమీ ఇతర సంస్థల్ని పూర్తిగా కొనుగోలు చేయడం లేదా పెద్దమొత్తంలో వాటాను చేజిక్కించుకునే ప్రయత్నాలు కూడా చేసింది. అలా ఇప్పటి వరకు 11 సంస్థల్ని సొంతం చేసుకోగా..వాటిలో ట్యాప్‌చీఫ్,మాస్ట్రీ,ప్రిప్లాడర్,'హండా కా ఫండా'లు ఉన్నాయి. వీటిలో ప్రిప్లాడర్ PrepLadderలో జూలై 2020లో $50 మిలియన్లు అత్యధికంగా చెల్లించి దక్కించుకుంది. 

చదవండి: జూమ్‌ కాల్‌లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top