నగరంలో మరోసారి పాప్ కల్చర్ కామికాన్ డ్రీమ్‌హాక్–2025 ఫెస్ట్ సందడి నెలకొన్నది. హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్ట్‌లో కామిక్స్, యానిమే, గేమింగ్, కాస్‌ప్లే, మర్చండైజ్ వంటివన్నీ ఒక్కచోట చేరి యువతకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్నాయి.
పాప్ కల్చర్‌పై హైదరాబాద్ యువత చూపిస్తున్న ఆసక్తి కారణంగా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌లకు సరికొత్త కేంద్రంగా మారుతుందనే దానికి సంకేతం.
కామికాన్ కేవలం వినోదమే కాదు.. సృజనాత్మకత, కళా సంబరాల సమ్మేళనం.
తొలి రోజున యానిమే ప్యానెల్స్, గేమింగ్ టోర్నమెంట్లు, కాస్‌ప్లే కాంటెస్ట్‌లతో వేదిక సందడిగా మారింది.
సాయంత్రం నిర్వహించిన సంగీతం, కామెడీ, డ్యాన్స్ ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొంది.


