కోరమాండల్‌ లాభం రూ.755 కోట్లు | Coromandel International Q2 net profit rises 2percent to Rs 757 crore | Sakshi
Sakshi News home page

కోరమాండల్‌ లాభం రూ.755 కోట్లు

Oct 27 2023 6:29 AM | Updated on Oct 27 2023 6:29 AM

Coromandel International Q2 net profit rises 2percent to Rs 757 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్‌ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది.

ఫలితాల నేపథ్యంలో కోరమాండల్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. 

Advertisement
 
Advertisement
Advertisement