ఏపీలో కోరమాండల్‌ ప్లాంటు నిర్మాణం ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఏపీలో కోరమాండల్‌ ప్లాంటు నిర్మాణం ప్రారంభం

Published Tue, Apr 30 2024 6:29 AM

Coromandel International to invest Rs 1,000 cr to set up plant in Andhra Pradesh

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్‌ యాసిడ్‌–సల్ఫరిక్‌ యాసిడ్‌ కాంప్లెక్స్‌ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ వెల్లడించారు. 

రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్‌ యాసిడ్‌ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్‌ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్‌ యాసిడ్‌ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది.

 ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్‌ ప్లాంటు ఫాస్ఫటిక్‌ ఫెర్టిలైజర్‌ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్‌పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్‌ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement