CNG Price: సీఎన్జీ ధర మళ్లీ పెరిగింది

CNG Price in Hyderabad: 1 Kg CNG Price Rs 92 Today - Sakshi

కిలోకు రూ.2 పెరుగుదల

హైదరాబాద్‌లో రూ.92కు చేరిక 

సాక్షి, హైదరాబాద్: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్జీ) ధర మళ్లీ పెరిగింది. కిలోపై రూ. 2 పెరగడంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.92కు చేరింది. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయికి ఎగబాగుతోంది. మరోవైపు పెట్రోల్‌ బంకులో కిలో ధరపై అదనంగా రూ.5 నుంచి రూ.10 బాదేస్తున్నాయి. 

కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంతో సీఎన్జీ వినియోగం వైపు వెళితే.. పెరిగిన ధరలతో మళ్లీ వెనక్కి వెళ్లని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పెట్రోల్, డీజిల్‌ కంటే సీఎన్జీ, గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్‌ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలోకు 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. ప్రయాణికులను చేరేవేసే ఆటోలు, ఇతర వాహనదారులు తమ ట్యాంకులను ఎక్కువ శాతం సీఎన్జీకి బదిలీ చేసుకున్నాయి. 

మరోవైపు ఇంధన కొరత 
మహానగరంలో సీఎన్జీ  కొరత ఏర్పడింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలను తట్టుకోలేక సీఎన్జీ గ్యాస్‌ కిట్లు అమర్చుకున్న వాహనాలకు కొరత వెంటాడుతోంది. గత ఆరు నెలలలో వాహనాల సంఖ్య ఎగబాగడంతో  సీఎన్జీ బంకులకు సరఫరా అవుతున్న గ్యాస్‌ ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. బంకుల్లో లోడ్‌ నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్‌ నిండుకుంటోంది. ఫలితంగా వాహనదారులు సీఎన్జీ కోసం క్యూ కడుతున్నారు. (క్లిక్ చేయండి: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్‌ దందా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top